Hinduja Family: హిందూజా కుటుంబ సభ్యులు 4గురికి శిక్ష విధించిన స్విస్ క్రిమినల్ కోర్టు
బిలియనీర్ హిందూజా కుటుంబానికి చెందిన నలుగురికి శుక్రవారం స్విస్ క్రిమినల్ కోర్టు నాలుగున్నర సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించింది. అదే సమయంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను కొట్టివేసింది. భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త ప్రకాష్ హిందుజా అతని భార్య, కుమారుడు , కోడలు బెదిరించి పని చేసే కార్మికుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై ఈ జైలు శిక్ష విధించారు. పూర్తిగా నిరక్షరాస్యులైన భారతీయులు జెనీవాలోని వారి విలాసవంతమైన లేక్‌సైడ్ విల్లాలో పని చేస్తున్నారు. హిందూజాలు కార్మికులకు స్విస్ ఫ్రాంక్‌లలో కాకుండా భారతీయ రూపాయలలో కూడా చెల్లించారు . వీటిని భారత్ లో నగదు చేసుకోవడం సాధ్యం కాలేదు. .
తక్కువ వేతనాలు చెల్లించి వారి సేవల పొందడంపై స్విస్ కోర్టు ఆగ్రహం
ఐదవ ప్రతివాది - నజీబ్ జియాజీ, కుటుంబ వ్యాపార మేనేజర్ హాజరైనప్పటికీ నలుగురు జెనీవాలోని కోర్టులో లేరు. కానీ అతనికి 18నెలల సస్పెండ్ శిక్ష విధించింది .దీనిపై అప్పీలు చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ నలుగురు కార్మికులను దోపిడి చేయడం,అనధికారికంగా ఉపాధి కల్పించడం,స్విట్జర్లాండ్‌లో అటువంటి ఉద్యోగాల కోసం వేతనంలో పదో వంతు కంటే తక్కువ వేతనాలు చెల్లించి వారి సేవలను పొందడంపై స్విస్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కనీసం పాక్షికంగానైనా వారు ఏమి చేస్తున్నారో సిబ్బందికి తెలుసు కాబట్టి అక్రమ రవాణా ఆరోపణలను కొట్టివేసింది. నలుగురు హిందూజాలు గృహ కార్మికులను విల్లా నుండి బయటకు వెళ్లకుండా నిషేధించారు.ఇతర విషయాలతోపాటు ఎక్కువ గంటలు పని చేయమని బలవంతం చేశారు.