
Isreal : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని వెల్లువెత్తిన నిరసనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ లో ప్రభుత్వ నిరసనకారులు మరోసారి రోడ్లమీదకు వచ్చారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నిరసనలు తెలిపారు.
హమాస్ ఉగ్రవాదులతో యుద్ధానికి ఆపడంతో పాటు దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రజలు నిరసన గళమెత్తారు.
హమాస్ చేతిలో బందీగా ఉన్న వారిని కూడా విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనకారులు శనివారం టెల్ అవీవా, సిజేరియా, హైఫా వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు.
హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయించడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు.
తక్షణమే ఇజ్రాయెల్ ప్రధాని పదవికి నెతన్యాహు రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినదించారు.
హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబసభ్యులు నెతన్యాహు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Protests in Isreal
హిజ్బుల్లా శిక్షణ కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని పెద్ద పెద్ద బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు.
ఇదిలా ఉండగా సిరియా సరిహద్దుకు సమీపంలోని జనతా గ్రామంలో హిజ్బుల్లా ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని తూర్పు లెబనాన్ లోని బెకా వ్యాలీపై ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
అయితే బాల్ బెక్ కు సమీపంలో ఉన్న సఫారీ పట్టణంపై వైమానికి దాడులు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా తెలిపాయి.