Saudi-UAE War: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత.. సౌదీ-యూఏఈ యెమెన్ పోరులో ఘర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
నిన్నామొన్నటిదాకా గాజా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా ఉండగా, కొత్త సంవత్సరంలో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరానీయుల నిరసనలతో అల్రెడీ టెన్షన్ వాతావరణంలో ఉండగా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య కొత్త టెన్షన్ ఏర్పడింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యాన్ని మరోసారి రణరంగంగా మార్చింది. యెమెన్‌లో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఒక వైపునకు సౌదీ అరేబియా-యూఏఈ మద్దతు అందిస్తోంది. తాజాగా, యూఏఈ మద్దతుగల దళాలపై సౌదీ అరేబియా దాడులు చేపట్టింది. ఈ ఘటనలో యూఏఈ మద్దతుగల యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన, రెండు గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
Details
ఎస్టీసీ కీలక ప్రాంతాల ఆక్రమణ
యెమెన్ విషయంలో సౌదీ-యూఏఈ మద్దతు ఇచ్చే విధానం ఇప్పుడు జోక్యాన్ని, స్నేహాన్ని చెడగొడుతోంది. దక్షిణ, తూర్పు యెమెన్‌లను యెమెన్ ప్రభుత్వం (ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ గవర్న్మెంట్ - ఐఆర్‌జీ) పాలిస్తోంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్టీసీ) కీలక భాగస్వామిగా ఉంది. అయితే, స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుని, డిసెంబరు నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది. హద్రామావత్, అల్-మరాహ్ వంటి భూభాగాలను సొంతం చేసుకోవడం, ఇంధన వనరులు అందుబాటులోకి రావడం, యెమెన్‌లో కలహాలకు కారణమైంది.
Details
యూఏఈ మద్దతుగల ఎస్టీసీపై సౌదీ దాడులు
ప్రస్తుతం ఐఆర్‌జీకి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుంటే, ఎస్టీసీకి యూఏఈ మద్దతు ఉంది. ఇరు దేశాలు వేర్వేరు దళాలకు మద్దతు ఇవ్వడం, ఘర్షణలకు తావిచ్చింది. సౌదీ ప్రభుత్వం యెమెన్ సమైక్యంగా ఉండాలని భావిస్తోంది, కానీ ఎస్టీసీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటోంది. ఈ పరిణామాల్లో యూఏఈ మద్దతుగల ఎస్టీసీపై సౌదీ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం, ముందే చోటుచేస్కోవాల్సిన తదుపరి ఉద్రిక్తతలు ఏ విధంగా ఎదురవుతాయో చూడాల్సి ఉంది.