LOADING...
Venezuela: వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు
వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు

Venezuela: వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెంట్రల్ కారకాస్‌లో ఉన్న మిరోఫ్లోర్స్ ప్యాలెస్ పరిసరాల్లో అనుమానాస్పదంగా డ్రోన్‌లు ఎగరడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. వాటిని నిలువరించేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెనెజువెలా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Details

ఒక నిమిషం పాటు కాల్పులు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అధ్యక్ష భవనం సమీపంలోని ఓ నివాసి మాట్లాడుతూ.. దాదాపు ఓ నిమిషం పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయని, అయితే అవి అత్యంత తీవ్రంగా లేవని తెలిపాడు. తాజా పరిణామాలపై అమెరికా స్పందించింది. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టంగా ప్రకటించింది. వెనెజువెలాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉండగా, అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాల మధ్య సమన్వయ లోపం కారణంగానే కాల్పులు జరిగి ఉండవచ్చని సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది.

Advertisement