సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలకు కారణం అదేనట!
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నరహంతకుడిని ఎలా విడదుల చేస్తారంటూ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ దేశ చట్టం ప్రకారమే చార్లెస్ శోభరాజ్ విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మంచి ప్రవర్తనతో 75శాతం జైలు శిక్షను పూర్తి చేసిన ఖైదీలను విడుదల చేయొచ్చని ఆ దేశ చట్టం చెబుతోంది. 20ఏళ్ల శిక్షా కాలంలో 17 ఏళ్లు ఇప్పటికే అనుభవించానని, మంచి ప్రవర్తనతో మెలిగిన తన విడుదలకు సిఫార్సు చేయాలని చార్లెస్ శోభరాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు చార్లెస్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చట్టం ప్రకారమే శోభరాజ్ విడుదల
చార్లెస్ శోభరాజ్ ఇప్పటికే.. 95శాతం జైలు శిక్షను అనుభవించాడని, వయస్సును దృష్టిలో పెట్టుకొని ముందుగానే విడుదల చేసినట్లు అతని లాయర్ రామ్ బంధు శర్మ తెలిపారు. 2003 ఆగస్టులో శోభరాజ్‌ను ఖాట్మండు క్యాసినోలో అరెస్టు చేశారు. విచారణ అనంతరం హత్య కేసులో అతడికి జీవిత ఖైదు పడింది. భారత్‌లో కూడా శోభరాజ్ జైలు శిక్ష అనుభవించాడు. 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తన పుట్టినరోజు నాడు మత్తుమందు కలిపిన స్వీట్లు ఇచ్చి తీహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. అనేక భాషలు మాట్లాడే శోభరాజ్ 1970-79 మధ్యంలో 15 నుంచి 20 మందిని చంపినట్లు అనుమానిస్తున్నారు.