Page Loader
US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక 
US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక

US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక 

వ్రాసిన వారు Stalin
Feb 05, 2024
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల మిలీషియాలను జో బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది. జోర్డాన్‌లో ఇటీవల ఇరాన్ మద్దతుగల బృందం జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. జోర్డాన్‌లో తన సైనికులపై దాడులకు ప్రతీకారంగా ఇరాక్, సిరియాలోని ఇరాన్-మద్దతుగల మిలీషియా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు సంబంధించిన 85 స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత, యెమెన్‌లోని హౌతీ నియంత్రణ ప్రాంతాలపై యూఎస్, బ్రిటిష్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి.

అమెరికా

దాడి చేస్తే ఊరుకునేది లేదు: సుల్లివన్ 

తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక ఇరాన్‌ను కీలక హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ నేరుగా స్పందిచాలనుకుంటే, తమ నుంచి వచ్చే బలమైన ప్రతిస్పందన కోసం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇరాక్, సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా లేదా హౌతీ తిరుగుబాటుదారులు భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశాన్ని మేము తోసిపుచ్చలేమన్నారు. తాము నేరుగా యుద్ధాన్ని కోరుకోవడం లేదని జేక్ సుల్లివన్ అన్నారు. అయితే ఇరాన్ దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.