Loading...
Barron Trump: బ్యారన్‌ ట్రంప్‌కు బెదిరింపులు.. ఏకాంతంలో ట్రంప్‌ కుమారుడు
బ్యారన్‌ ట్రంప్‌కు బెదిరింపులు.. ఏకాంతంలో ట్రంప్‌ కుమారుడు

Barron Trump: బ్యారన్‌ ట్రంప్‌కు బెదిరింపులు.. ఏకాంతంలో ట్రంప్‌ కుమారుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఏకాంత జీవితం గడుపుతున్నారని 'న్యూయార్క్‌ పోస్ట్‌' వెల్లడించింది. కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్న బ్యారన్‌.. తనను హత్య చేసిన వారికి ఇరాన్‌ రివార్డు ప్రకటించిందన్న వార్తల నేపథ్యంలో మరింత అప్రమత్తమైనట్లు తెలిపింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)కు అనుబంధంగా ఉన్న మీడియా సంస్థ ఛానెల్‌-3.. 'బ్యారన్‌ను ఎక్కడ చంపొచ్చు' అనే శీర్షికతో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. ఆ కార్యక్రమంలో బ్యారన్‌ ఎక్కడెక్కడ తిరుగుతారన్న వివరాలను బహిర్గతం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా బ్యారన్‌ను హత్య చేసిన వారికి 10 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.95 కోట్లు)బహుమతిగా ఇస్తామని ప్రకటించినట్లు వెల్లడించింది.

వివరాలు

కిర్క్‌ హత్యతో తీవ్ర వేదన

కొంతకాలం క్రితం వరకు బ్యారన్‌ ట్రంప్‌ జాతీయవాద కార్యకర్త చార్లీ కిర్క్‌కు సన్నిహితంగా ఉన్నారని న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది.

కిర్క్‌ గత ఏడాది హత్యకు గురికావడంతో బ్యారన్‌ తీవ్రంగా కలత చెందారని పేర్కొంది. అంతేకాకుండా తన తండ్రి డొనాల్డ్‌ ట్రంప్‌పై రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు హత్యాయత్నాలు జరగడం కూడా బ్యారన్‌ను తీవ్రంగా కుదిపేసిందని వివరించింది.

వేసవిలో ఎక్కువ సమయం బ్యారన్‌ తన తల్లి మెలానియా ట్రంప్‌తో కలిసి న్యూజెర్సీలోని ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌ బెడ్‌మిన్‌స్టర్‌లో గడిపినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది.

''బ్యారన్‌ బయటికి అడుగుపెట్టడం లేదు. ఏకాంతాన్నే కోరుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది.

ADVERTISEMENT