LOADING...
Newyork: న్యూయార్క్‌లో విమాన ప్రమాదం.. 100 మీటర్లు ఎగిరి పడినా ప్రాణాలతో బయటపడిన ఎయిర్‌హోస్టెస్
100 మీటర్లు ఎగిరి పడినా ప్రాణాలతో బయటపడిన ఎయిర్‌హోస్టెస్

Newyork: న్యూయార్క్‌లో విమాన ప్రమాదం.. 100 మీటర్లు ఎగిరి పడినా ప్రాణాలతో బయటపడిన ఎయిర్‌హోస్టెస్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి సంభవించిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఓ ఫ్లైట్‌ అటెండెంట్‌ అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం విశేషంగా మారింది. 100 మీటర్లు ఎగిరిపడిన అటెండెంట్‌ ప్రమాద సమయంలో ఫ్లైట్‌ అటెండెంట్‌ సొలాంజ్‌ ట్రొంబ్లే విమానం నుంచి సుమారు 100 మీటర్ల దూరానికి ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆమెకు కాళ్లు, చేతులకు పలు చోట్ల ఎముకలు విరిగాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాలు 

నాలుగు పాయింట్ల భద్రత సీటు

విమాన ముందుభాగం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడటం ఆశ్చర్యకరమని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఆమె సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్ల భద్రత సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలు నిలిచాయని భావిస్తున్నారు. ల్యాండింగ్‌ సమయంలో సీటుబెల్ట్‌ పెట్టుకున్నదే తనకు గుర్తుందని, ఆ తర్వాత జరిగినది ఏమీ గుర్తులేదని ట్రొంబ్లే వైద్యులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె షాక్‌లో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

వివరాలు 

రన్‌వేపై అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టిన విమానం

కెనడాలోని మాంట్రియల్‌ నుంచి బయలుదేరిన ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్‌ సీఆర్‌జే-900 విమానం న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో నాలుగో రన్‌వేపై దిగింది. అనంతరం టాక్సీయింగ్‌ చేస్తుండగా రన్‌వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ప్రభావంతో విమానం ముందుభాగం పైకి లేచి తీవ్రంగా ధ్వంసమైంది. న్యూయార్క్‌ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

Advertisement