Loading...
Trump: హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. అమెరికా నియంత్రణ, 20% ఛార్జీల ప్రతిపాదన
అమెరికా నియంత్రణ, 20% ఛార్జీల ప్రతిపాదన

Trump: హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. అమెరికా నియంత్రణ, 20% ఛార్జీల ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్మూజ్‌ జలసంధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో స్పందించిన ఆయన,ఇకపై ఈ కీలక సముద్ర మార్గం భద్రత,నిర్వహణ బాధ్యతలను అమెరికా చేపడుతుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఒక పోస్టు చేశారు. హర్మూజ్‌ జలసంధి భద్రతను అమెరికా పర్యవేక్షిస్తుందని, అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా అమెరికానే నిర్వర్తిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సేవలకు ప్రతిఫలంగా హర్మూజ్‌ గుండా ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక తరలిస్తున్న సరుకు విలువలో 20 శాతం మేర రుసుము అమెరికాకు చెల్లించాలని ప్రతిపాదించారు.

వివరాలు 

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ ఆగ్రహం

ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ఆయన వెల్లడించారు.

అదే సమయంలో ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధి తెరిచే ఉందని ట్రంప్‌ స్పష్టం చేశారు.

అయితే, గతంలో మాదిరిగానే ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని చెప్పారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది.

హర్మూజ్‌ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇరాన్‌ సైనిక కమాండ్‌ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

వివరాలు 

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ ఆగ్రహం

ఈ అంశంలో అమెరికాతో సహకరించే ఏ గల్ఫ్‌ దేశాన్నైనా యుద్ధ చర్యలో భాగస్వామిగా పరిగణిస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, అమెరికా సైనిక దళాల శత్రుత్వపూరిత చర్యల కారణంగానే హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్‌ పర్షియన్‌ గల్ఫ్‌ స్ట్రెయిట్‌ అథారిటీ (PGSA) ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి, నౌకల అనుమతుల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ వెల్లడించింది.

ADVERTISEMENT