Trump: JFK, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాలను బహిర్గతం చేయాలని.. ట్రంప్ కీలక ఆదేశాలు..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో మరింత జోరు పెంచారు.
ప్రతి రోజు అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ,మాజీ సెనెటర్ రాబర్ట్ ఎఫ్. కెన్నడీ, పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలపై సంబంధించిన దస్త్రాలను బహిరంగం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఎలా బహిరంగం చేయాలని 15రోజుల కిందట నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.
అలాగే,రాబర్ట్ ఎఫ్.కెన్నడీ,మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాల విడుదలపై 45రోజుల్లోగా ప్రణాళిక ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం: ట్రంప్
ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన తర్వాత ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
''ఇవి చాలా పెద్ద అంశాలు.ఈ విషయాలను తెలుసుకునేందుకు దశాబ్దాలుగా చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.హత్యల వెనుక ఏం జరిగిందో తెలుసుకోవడానికి బాధిత కుటుంబాలు,అమెరికా ప్రజలు హక్కు పొందాలని భావించాను.అన్ని విషయాలు బయటకొస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను'' అని ఆయన అన్నారు.
జాన్ ఎఫ్. కెన్నడీ హత్యపై ట్రంప్ గతంలో కూడా పలుమార్లు మాట్లాడారు. ఆయన మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతున్నా,ఇప్పటికీ ఆ హత్య రహస్యంగానే ఉందని వ్యాఖ్యానించారు.
తాను తిరిగి వైట్‌హౌస్‌కి వచ్చిన్నప్పుడు ఆ పత్రాలను బహిర్గతం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు.
వివరాలు
43 సంవత్సరాల వయస్సులోనే జాన్ ఎఫ్. కెన్నడీ అమెరికా అధ్యక్ష్య పీఠం
1961లో అమెరికాకు 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెన్నడీ బాధ్యతలు చేపట్టారు. 43 సంవత్సరాల వయస్సులోనే ఆ పీఠాన్ని అధికారం చేసుకొని ఆయన అరుదైన ఘనతను సాధించారు.
1963 నవంబరు 22న టెక్సాస్ పర్యటనలో ఉన్నప్పుడు దుండగుడు అతనిపై కాల్పులు జరిపి ఆయనను హత్య చేశాడు.
ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో లీ హార్వే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే అతడు కూడా హత్యకు గురయ్యాడు.
హార్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష వేయగా.. కొంతకాలం తర్వాత అతను క్యాన్సర్‌తో మరణించాడు. అప్పటి నుంచి కెన్నడీ హత్య రహస్యంగా మిగిలింది.
వివరాలు
1968లో రాబర్ట్ ఎఫ్. కెన్నడీ హత్య
అమెరికా అటార్నీ జనరల్‌గా,సెనెటర్‌గా పనిచేసిన రాబర్ట్ ఎఫ్. కెన్నడీ 1968లో హత్యకు గురయ్యారు.
ఈ హత్య డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలు జరుగుతున్న సమయంలో, లాస్ ఎంజెలెస్‌లోని అంబాసిడర్ హోటల్ వద్ద జరిగినట్లు తెలిసింది.
అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు, దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
నిందితుడిని పాలస్తీనాకు చెందిన సిర్హాన్ గా గుర్తించారు.
అలాగే, పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా 1968లో ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా దుండగుడి కాల్పుల కారణంగా మరణించారు.