Donald Trump: సిల్క్‌రోడ్ డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడు రాస్ ఉల్బ్రిచ్ట్‌కి ట్రంప్ క్షమాభిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తూ, పలు కేసుల్లో దోషులను విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో సిల్క్‌రోడ్ డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడు రాస్ విలియం ఉల్‌బ్రిచ్ట్ కూడా క్షమాభిక్ష పొందారు.
ఇంటర్నెట్ వేదికగా విస్తృత స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఉన్న ఆరోపణలపై అమెరికా న్యాయస్థానం రాస్ విలియంకు 2015లో జీవిత ఖైదు విధించింది.
సిల్క్‌రోడ్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ను స్థాపించి, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, కంప్యూటర్ హ్యాకింగ్ చేయటానికి పాల్పడినట్లు విలియంపై ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
ఆరుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన రాస్ విలియం
2013లో ఎఫ్‌బీఐ ఆ వెబ్‌సైట్‌ను మూసివేసింది.
"అతడొక డ్రగ్ డీలర్, ప్రజల వ్యసనాల నుండి లబ్ధిపొందాడు. ఆరుగురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు" అని జీవిత ఖైదు విధించినప్పుడు మాన్‌హటన్ అటార్నీ పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ గత మే నెలలో రాస్ విలియంకు క్షమాభిక్ష ఇస్తానని హామీ ఇచ్చారు.
అతడు ఇప్పటికే 11 సంవత్సరాల శిక్ష అనుభవించాడని, అతడికి విధించిన శిక్ష హాస్యాస్పదమని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరికొద్ది, పాఠశాలలు, చర్చిలలో అక్రమ వలసదారుల అరెస్టు విషయానికి వస్తే, చర్చిలు, పాఠశాలల్లో అక్రమ వలసదారులను అరెస్టు చేయకూడదనే గత నిబంధనను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది.
వివరాలు
అక్రమ వలసదారుల అరెస్టుకు అవకాశం
ఈ కొత్త నిర్ణయంతో ఇకపై పాఠశాలలు, చర్చిలలో కూడా అక్రమ వలసదారుల అరెస్టుకు అవకాశం కలుగుతుంది.
ఈ తొలగింపు వల్ల ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులకు అరెస్టులను వేగవంతం చేసేందుకు అనుమతి లభించినట్లయింది.
హంతకులు, రేపిస్టులను పట్టుకునేందుకు ఈ తాజా ఉత్తర్వులు సహాయపడతాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ నిర్ణయాన్ని సమర్థించింది.