Trump-Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. ఆయన తనను తాను వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు తన Truth Social ఖాతాలో ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఆ స్క్రీన్‌షాట్‌ను చూస్తే అది వికీపీడియా పేజీని పోలి ఉండేలా ఎడిట్ చేసిన ఫోటోగా కనిపిస్తోంది. అందులో డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో పాటు, ఈ ఏడాది జనవరి నుంచి ఆయన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Truth Social ఖాతాలో ట్రంప్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్
New media post from Donald J. Trump
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 12, 2026
(TS: 11 Jan 20:23 ET) pic.twitter.com/aVehtmdCrl