Page Loader
Donald Trump: కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్ 
కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్

Donald Trump: కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చలో కమలాహారిస్దే పై చేయి అని పలు మీడియా నివేదికలు తెలిపాయి. ఈ క్రమంలో ట్రంప్ మరో చర్చకు సిద్ధంగా లేనని వెల్లడించారు.ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. కమలాహారిస్‌తో జరిగిన చర్చలో తాను గెలిచానని, కానీ సర్వేలు వేరే అంశాలను చూపిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగా, తనకు మూడో చర్చలో పాల్గొనాలన్న ఆసక్తి లేదని స్పష్టం చేశారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ట్రంప్, హారిస్‌లు పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా మొదటి చర్చలో పాల్గొన్నారు.

వివరాలు 

ట్రంప్‌పై ఎనిమిది ఆరోపణలు 

ఈ చర్చలో కమలాహారిస్ విజయమని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రంప్ దీన్ని తిరస్కరించారు. చర్చ జరిగిన వెంటనే, 24 గంటల్లో హారిస్‌కు 47 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 394 కోట్లు) విరాళాలు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇక మరోవైపు, అక్టోబర్ 1న న్యూయార్క్‌లో ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్, డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ టీమ్ వాజ్‌ల మధ్య చర్చ జరగనుంది. ట్రంప్‌పై ఉన్న రెండు నేర అభియోగాలు ఇటీవల కోర్టు కొట్టివేసింది.2020 ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్న కేసులో ట్రంప్‌కు సంబంధించి ఉన్న రెండు కౌంటీలను జార్జియాలోని ఫాల్టన్ కౌంటీ న్యాయమూర్తి కొట్టివేశారు. అయితే, ట్రంప్‌పై ఉన్న ఎనిమిది ఆరోపణలు ఇంకా విచారణలో ఉన్నాయి.