DOGE: ప్రభుత్వ ఖర్చుల సంస్కరణలలో కీలక మార్పు.. 'డోజ్' విభాగం మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చిన వెంటనే దేశంలో జరుగుతున్న అనవసర ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో విస్తృత మార్పులు తీసుకురావడం లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ నిర్ణయించిన లక్ష్యాలు నెరవేరిన తర్వాత, అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు జరగనున్న 2026 జూలై 4వ తేదీకి ముందే ఈ ఫెడరల్ బ్రూరోక్రసీని పూర్తిగా మార్చివేస్తామని అప్పటికే ట్రంప్ ప్రకటించారు. అయితే నిర్ణయించిన గడువుకంటే దాదాపు ఎనిమిది నెలలు ముందుగానే డోజ్‌ను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'డోజ్' విభాగం మూసివేత
DOGE quietly disbanded despite having eight months remaining on charter: ‘That doesn’t Exist’ https://t.co/FYlxijq7id pic.twitter.com/t8WMprdtt8
— One America News (@OANN) November 23, 2025