LOADING...
Donald Trump: నోబెల్‌ రేసులో ట్రంప్‌ పేరు.. ఈసారైనా కల నిజమవుతుందా?
నోబెల్‌ రేసులో ట్రంప్‌ పేరు.. ఈసారైనా కల నిజమవుతుందా?

Donald Trump: నోబెల్‌ రేసులో ట్రంప్‌ పేరు.. ఈసారైనా కల నిజమవుతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి-2026కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి మొత్తం 287 నామినేషన్లు అందగా, అందులో ట్రంప్ పేరు కూడా ఉండొచ్చని విదేశీ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అయినా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందా అనే చర్చ ప్రారంభమైంది. గురువారం విడుదల చేసిన ప్రకటనలో నోబెల్ కమిటీ, 208 మంది వ్యక్తులు మరియు 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చాయని వెల్లడించింది.

వివరాలు

గతేడాది ఎనిమిది యుద్ధాలను ఆపాను : ట్రంప్

ట్రంప్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీ, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ తదితరుల పేర్లు కూడా ఉండొచ్చని సమాచారం. అయితే నామినేషన్ల వివరాలను కమిటీ గోప్యంగా ఉంచే విధానం పాటించడంతో ఈ పేర్లపై అధికారిక ధ్రువీకరణ లేదు. ఇక గతేడాది ఎనిమిది యుద్ధాలను ఆపానని ప్రకటిస్తూ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇజ్రాయెల్, రష్యా, పాకిస్థాన్ సహా పలు దేశాలు, వ్యక్తులు ఆయన పేరును ప్రతిపాదించినప్పటికీ చివరికి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడోకు బహుమతి దక్కడంతో ట్రంప్ నిరాశ చెందారు.

వివరాలు

మెరికా-ఇరాన్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు

ఇదిలా ఉండగా తాజా నామినేషన్లలో కూడా ట్రంప్ పేరు ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికి దిగడం, ఆ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. శాంతి చర్చల ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఆశిస్తున్న నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా 2026 నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 9న ప్రకటించనుండగా, డిసెంబర్ 10న Osloలో బహుమతి ప్రదానం జరుగుతుంది. నామినేషన్ల సమర్పణకు గడువు జనవరి 31తో ముగిసింది.

Advertisement