
US Tariffs: చైనాపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 100% అదనపు సుంకాల అమలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తన భేటీ ఉండాల్సిన సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు ఖనిజాల ఎగుమతులపై చైనా విధించిన పలు ఆంక్షల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఇటువంటి పరిస్థితుల్లో జిన్‌పింగ్‌ను కలవడానికి సరైన కారణం కనిపించడం లేదని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించాల్సిందేనని బలంగా ఎత్తిచూపారు.
Details
చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు
ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా మాట్లాడుతూ, "చైనాలో అమోఘ రీతిలో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అరుదైన ఖనిజాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ప్రపంచ దేశాలన్నింటికీ లేఖలు పంపిస్తున్నారు. ఈ విధానంతో అందరినీ శత్రువుల్లా చేసుకుంటున్నారు. కొంతకాలం నుంచి చైనాతో మనకు మంచి సంబంధాలున్నా, ఇటీవల వారి చేష్టలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అందుకే దక్షిణ కొరియా పర్యటన సమయంలో జిన్‌పింగ్‌తో సమావేశం అవాల్సిన అవసరం ఇక మిగలడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలను అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
Details
భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
చైనా అసాధారణ దూకుడుతో వ్యవహరిస్తోందని, దానికి ప్రతీకారంగా అదనపు సుంకాలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. అదనంగా అమెరికా ఎగుమతి నియంత్రణలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురడంతో స్టాక్ మార్కెట్లలో భారీ పతనం నమోదైంది. బీజింగ్ ఫెంటానిల్ వాణిజ్యానికి సహకరిస్తోందని ఆరోపించిన ట్రంప్, దానిని కారణంగా చూపిస్తూ చైనా వస్తువులపై మరింత సుంకాలు విధించారు. తన ట్రూత్ సోషల్ నెట్వర్క్ ద్వారా చైనాను సుంకాల బెదిరింపులతో గట్టిగా హెచ్చరించారు. ప్రపంచాన్ని చైనా బందీలా చేసేందుకు అనుమతించకూడదని స్పష్టం చేస్తూ, చైనా ప్రవర్తనను శత్రుత్వంగా అభివర్ణించారు.