Trump: జనరిక్ మందులపై ట్రంప్ కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి సున్నా సుంకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి అమెరికాకు వచ్చే అన్ని జనరిక్ ఔషధాలపై సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం రెండేళ్ల పాటు, అంటే ఆగస్టు 2028 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అయితే ఈ వెసులుబాటు తాత్కాలికమేనని ట్రంప్ స్పష్టం చేశారు. మూడో ఏడాది నుంచి జనరిక్ ఔషధాల దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని, నాలుగో ఏడాది నుంచి దానిని 200 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
ఔషధ తయారీ రంగాన్ని మరింత బలోపేతమే లక్ష్యం
ఈ రెండేళ్ల గడువును ఉపయోగించుకుని జనరిక్ ఔషధాలను తయారు చేసే సంస్థలు అమెరికాలోనే తమ తయారీ యూనిట్లు లేదా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ సూచించారు.
దేశీయంగా ఔషధాల తయారీని ప్రోత్సహించడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగానే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడిస్తూ, అమెరికాలో ఔషధ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.