LOADING...
Trump: ఇరాన్ డీల్‌ విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ డీల్‌ విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్

Trump: ఇరాన్ డీల్‌ విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు మాత్రం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి కీలక అంశాలపై అమెరికా-ఇరాన్ మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. చర్చలు సజావుగా సాగుతున్నప్పటికీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని ట్రంప్ వెల్లడించారు. ఒప్పందంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు చర్చలకు మరింత సమయం కేటాయించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకల దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే రెండువేల నౌకలు

ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో చేసిన పోస్టు ద్వారా వెల్లడించారు. దీంతో ప్రపంచ ముడి చమురు రవాణా వ్యవస్థ త్వరలోనే సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇక యుద్ధపరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండువేల నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిని తెరిచినా కూడా నౌకాయానం వెంటనే సాధారణస్థితికి చేరుకోవడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం పూర్తిగా సురక్షితమని షిప్పింగ్ సంస్థలు నమ్మకం పొందిన తర్వాతే రవాణా మళ్లీ వేగం అందుకునే అవకాశం ఉంది. అదేవిధంగా హోర్ముజ్ జలసంధిలో అమర్చిన సముద్ర మైన్స్ తొలగింపుకు ఎంత సమయం పడుతుందన్నదానిపై కూడా ఇంకా స్పష్టత లేదు.

Advertisement