Donald Trump: ఇరాన్‌పై అమెరికా వైఖరి మారదు.. ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్ అవగాహన ఒప్పందం(ఎంవోయూ)నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా అమెరికా దానిని పెద్దగా పట్టించుకోదని అన్నారు. తమ ప్రధాన లక్ష్యం ఒక్కటేనని,ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే అమెరికా విధానమని ఆయన పునరుద్ఘాటించారు. ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎంవోయూ నుంచి వైదొలుగుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించడంపై మీ స్పందన ఏమిటని విలేకరి ప్రశ్నించగా,అలాంటి నిర్ణయాలతో అమెరికా తన విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేశారు. ఒప్పందంపై ఇరాన్ తీసుకున్న నిర్ణయం కంటే,ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచకుండా నిలువరించడమే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపారు.
వివరాలు
14 అంశాలతో రూపొందించిన ఎంవోయూ.. సంతకాలు పెట్టిన ఇరు దేశాల అధ్యక్షులు
గత జూన్‌లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరింది.
14 అంశాలతో రూపొందించిన ఆ ఎంవోయూపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు.
అయితే, ఆ ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే హర్మూజ్ జలసంధి ప్రాంతం చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి.
హర్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా, ఇరాన్ రెండూ ప్రయత్నాలు కొనసాగించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ పరిణామాల మధ్య అమెరికా ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటుండగా, ప్రతిస్పందనగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దృష్టి సారిస్తోంది.
దీంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.