Trump: ఫ్రాన్స్ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలను మతం, వలసలతో ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో నగరాలను ఇరాన్ ''తుడిచిపెట్టేయొచ్చు'' అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు
ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ చివరి నుంచి హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల ప్రవేశ ద్వారాలను దిగ్బంధించి ఆందోళనలు చేస్తున్నారు.
మెరుగైన విద్యా వసతులు కల్పించాలని, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని, అధిక సంఖ్యలో విద్యార్థులతో కిక్కిరిసిన తరగతి గదులను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
వేడిని తట్టుకోలేని పాఠశాల భవనాలు, విద్యార్థులపై అధిక పని భారం, సిబ్బంది కొరత వంటి అంశాలపైనా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆందోళనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. అక్టోబర్ 6న ఒక్కరోజే సుమారు 2.56 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వివరాలు
ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు
అయితే యూనియన్లు మాత్రం ఈ సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాయి.
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా వారికి మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు,నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలు, అల్లర్ల నియంత్రణకు ఉపయోగించే ఆయుధాలను ప్రయోగించారు.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వడం, వాహనాలు, బస్ షెల్టర్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలకు పాల్పడ్డారు.
ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి 215 మంది విద్యార్థులు, 715 మంది పోలీసులు గాయపడ్డారు. 5,000 మందికిపైగా అరెస్టయ్యారు.
వివరాలు
ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు
అరెస్టయిన వారిలో 87 శాతం మంది మైనర్లే ఉన్నారు. 24 పాఠశాలలు ధ్వంసమవడం లేదా అగ్నిప్రమాదాలకు గురికావడం జరిగింది.
ఇదే సమయంలో పోలీసుల చర్యలపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల స్టన్ గ్రెనేడ్ కారణంగా ఓ 15 ఏళ్ల విద్యార్థి చేతిని కోల్పోయాడు. మరో 14 ఏళ్ల బాలుడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల తీరుపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై పలు అంతర్గత విచారణలు ప్రారంభమయ్యాయి.
వివరాలు
'ఇది ఇస్లాం ఆక్రమణ'.. ట్రంప్ వ్యాఖ్యలు
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అసలు వివాదానికి కారణమయ్యాయి.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై స్పందిస్తూ.. ''ఇది అదుపు తప్పిన భారీ వలసల ఫలితం.
ఇది పాఠశాలల గురించి కాదు.. ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్న ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది'' అంటూ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పేర్కొన్నారు.
అయితే ఫ్రాన్స్‌లో విద్యార్థులు చేస్తున్న ప్రధాన డిమాండ్లకు, ట్రంప్ ప్రస్తావించిన ''ఇస్లాం ఆక్రమణ''కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆందోళనలపై అందుబాటులో ఉన్న తాజా వివరాల్లో ఎలాంటి ఆధారం కనిపించడం లేదు.
విద్యార్థులు ప్రధానంగా విద్యా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు చేస్తున్నారు.
ఈ విషయాన్నే ట్రంప్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.
వివరాలు
అమెరికాలోనూ మరో వివాదాస్పద వ్యాఖ్య
యూరప్‌లో వలసలు, భద్రత, సామాజిక సమస్యలను పరస్పరం ముడిపెడుతూ ట్రంప్,ఆయన మద్దతుదారులు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని పరిణామాలను కూడా వలస వ్యతిరేక రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన ట్రంప్ మరో వ్యాఖ్య అమెరికాలో కలకలం రేపింది.
నెబ్రాస్కాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన..యుద్ధం కారణంగా అమెరికాలో ఇంధన ధరలు పెరగడం దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు చెల్లించే ''చిన్న మూల్యం'' అని అన్నారు.
ఆ తర్వాత ''వాళ్లు ఒక నగరాన్ని తుడిచిపెట్టేయొచ్చు.లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి'' అన్నట్లుగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలకు సభలో ఉన్న కొందరు ట్రంప్ మద్దతుదారులు చప్పట్లు కొట్టారు.
వివరాలు
అమెరికాలోనూ మరో వివాదాస్పద వ్యాఖ్య
కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
ఆయనను ''ప్రమాదకరమైన, మతిభ్రమించిన వ్యక్తి'' అంటూ విమర్శించారు.
లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్.. అధ్యక్షుడి వ్యాఖ్యలు నగర భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని అన్నారు. శాన్‌డియాగో మేయర్ టాడ్ గ్లోరియా కూడా ఘాటుగా స్పందిస్తూ.. తమ నగరం ''యుద్ధంలో త్యాగం చేయాల్సిన వస్తువు కాదు'' అని స్పష్టం చేశారు.
వివరాలు
వైట్‌హౌస్ వివరణ
ట్రంప్ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది.
అమెరికా నగరాలపై ఇరాన్ దాడి చేయాలని ట్రంప్ కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడం వల్లే లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో వంటి అమెరికా నగరాలు సురక్షితంగా ఉన్నాయని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరించింది.
అయినప్పటికీ అధ్యక్షుడి నోటి నుంచి ''లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి.. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి'' అనే వ్యాఖ్యలు రావడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం, అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలు, సమీపిస్తున్న మధ్యంతర ఎన్నికలు కీలకంగా మారిన సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.