Trump: 'నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేశారు.. కానీ తిరస్కరించాను': ట్రంప్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను ఇరాన్'తో చర్చలు కొనసాగిస్తున్నానని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వెల్లడించారు. యుద్ధ పరిస్థితులను ముగించడానికి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇరానీయులు తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. దీనిపై స్పందిస్తూ ట్రంప్, "ఆ ఆఫర్ వినగానే నేను నవ్వేశాను. దాన్ని స్పష్టంగా తిరస్కరించాను. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా మారాలని అనుకోడు" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇరాన్‌పై ఒత్తిడి పెంచిన అమెరికా
గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, అమెరికా ఇప్పటికే ఇరాన్‌ను పూర్తిగా మట్టికరిపించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎవరూ సాధించని స్థాయిలో విజయాన్ని సాధించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ త్వరగా ఒక ఒప్పందానికి రావాలని చూస్తోందని, కానీ అంతర్గత భయాల కారణంగా వెనుకడుగు వేస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఒప్పందానికి అంగీకరిస్తే, సొంత ప్రజల నుంచే తీవ్ర ప్రతిస్పందన ఎదురవుతుందనే భయం ఇరాన్‌కు ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు 15 అంశాలతో కూడిన ప్రతిపాదనను పంపినట్లు వెల్లడించారు.
వివరాలు
5-సూత్రాల ప్రతిపాదనలో కీలక అంశాలు
అమెరికా ప్రతిపాదనలో ప్రధానంగా మూడు డిమాండ్లు ఉన్నాయి: ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలి హిజ్బుల్లా వంటి సంస్థలకు మద్దతు నిలిపివేయాలి హార్ముజ్ జలసంధి తిరిగి తెరవాలి ఈ షరతులను అంగీకరిస్తేనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. వైరల్‌గా మారిన ట్రంప్ వ్యాఖ్యలు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవి ఆఫర్ అయిందన్న వ్యాఖ్యపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.