Page Loader
చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో

చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 06, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త లుక్కులతో అదరగొడుతున్నారు. ఇటీవలే భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా వివాహ దుస్తులు ధరించిన మస్క్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కు సంబంధించిన మరో ఫొటో ట్విట్టర్లో దుమ్మురేపుతోంది. అంతగా ఆకట్టుకుంటున్న ఆ ఫోటో ఎక్కడిదంటారా.. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ చేసిన ఇంద్రజాలమే మరి. మస్క్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో దాదాపుగా ఎవరికీ తెలీదు. ఈ మేరకు ఏఐ టెక్నిక్ ద్వారా రూపొందించిన ఈ బుల్లి మస్క్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అటు ఇటు కదిలి చివరకు ఎలాన్ మస్క్ వరకు వెళ్లింది.

Twitter Booss Elon Musk New Look Goes Viral

ఇండియన్ ట్రేడిషనల్ లుక్ లో మస్క్ అదుర్స్ 

దీనిపై స్పందించిన మస్క్, సదరు ఫొటోను రీట్వీట్ చేస్తూ సరదాగా కామెంట్ ను జోడించారు. అమెరికాకు చెందిన ఓ యూజర్ ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మస్క్ వయస్సు పెరగకుండా ఉంచే ఫార్ములాను కనుగొన్నాడని చలోక్తులు విసిరాడు. అయితే ఈ కొత్త టెక్నిక్ ను తొలుత తానే వినియోగించాడని సదరు వినియోగదారుడు ట్విట్టర్ లో సరదగా రాసుకొచ్చాడు. ఆ ఫార్ములా కాస్తా వికటించి మస్క్ ఇలా తయారయ్యాడంటూ హస్యం జోడించాడు. దాదాపు 48 గంటల్లోనే ఈ ట్వీట్ 40 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇతనే బుల్లి ఎలాన్ మస్క్