హౌస్ పార్టీలో కాల్పులు: ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
జార్జియాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. డగ్లస్ కౌంటీలో 100మందికిపైగా యువకులు గుమిగూడిన హౌస్ పార్టీలో కాల్పులు జరపడంతో శనివారం ఇద్దరు వ్యక్తులు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో జరిగిన పార్టీలో ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కనపడితే సమాచారం ఇవ్వాలని డగ్లస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం (డీసీఎస్ఓ) స్థానికులను కోరింది.
జార్జియా
కాల్పులను సీరియస్‌గా తీసుకున్న డీసీఎస్ఓ
డగ్లస్ కౌంటీలోని హౌస్ పార్టీకి వెళ్లిన వారిలో చాలా మంది షూటింగ్ తర్వాత పొరుగున ఉన్న యార్డ్‌లలో కనిపించనట్లు అట్లాంటాలోని స్థానిక టెలివిజన్ స్టేషన్ డబ్ల్యూఎక్స్ఐఏ వెల్లడించింది.
ఈ కాల్పుల ఘటనపై డబ్ల్యూఎక్స్ఐఏతో ఇంటి యజమాని మాట్లాడారు. తమ ఇంట్లో ఉంటున్న వారు వారి కూతురు స్వీట్ 16 పార్టీని నిర్వహించినట్లు చెప్పారు. హాజరైన వారిలో కొందరు గంజాయి తాగారని, అందుకే పార్టీని రాత్రి 10:00 గంటలకు పార్టీని ముగించాలని నిర్ణయించారని చెప్పారు.అయితే షూటింగ్ సమయంలో అమ్మాయి పెద్దవాళ్లు ఉన్నారా? లేదా? తెలియదని పేర్కొన్నారు.
అయితే ఈ కాల్పులను సీరియస్‌గా తీసుకున్నట్లు డీసీఎస్ఓ వెల్లడించింది.