LOADING...
US-China: చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు.. భారత్‌ మద్దతు కావాలి: అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ 
US-China:చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు..భారత్‌ మద్దతు కావాలి:స్కాట్‌ బెసెంట్

US-China: చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు.. భారత్‌ మద్దతు కావాలి: అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ, అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, చైనా పరిస్థితుల విషయంలో అదే అమెరికా మన సహకారం ఆశిస్తోంది. అరుదైన ఖనిజాలపై (Rare Earth Metals) బీజింగ్ నియంత్రణకు ఎదురుగా నిలబడటానికి భారత్‌, ఐరోపా దేశాల మద్దతు అవసరమని అమెరికా ఆశిస్తోంది. ఈ విషయంపై ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

అరుదైన ఖనిజాల ఎగుమతిపై నియంత్రణలు

చైనా ఇటీవల ప్రపంచంలో దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై నియంత్రణలు విధించింది. విదేశీ కంపెనీలు ఈ ఖనిజాలను దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు పొందాల్సి ఉంటుంది అని స్పష్టంచేసింది. "ఇది కేవలం చైనా మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేరుగా ప్రభావం కలిగించే సవాలు. చైనా చేసిన నియంత్రణ ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై దాడి. మేము దీన్ని అంగీకరించము. బీజింగ్ దూకుడును మేము అడ్డుకుంటాము. అందుకు మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నాము. చైనాను ఎదుర్కోవడానికి భారత్, ఐరోపా దేశాల మద్దతు అత్యంత అవసరం" అని ఫాక్స్‌న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మంత్రి వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

వివరాలు 

అరుదైన ఖనిజాల నియంత్రణకు అమెరికా చర్యలు 

చైనా నియంత్రణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోపాన్ని తెప్పించింది. 100% అదనపు సుంకాలు విధించే నిర్ణయం తీసుకున్నారు. ఈ సుంకాలు నవంబరు 1 నుండి అమల్లోకి వస్తాయి. అంతేకాదు, చైనాకు అమెరికా నుంచి ఎగుమతించే కీలక సాఫ్ట్‌వేర్‌లపై కూడా నియంత్రణలు విధిస్తామని ప్రకటించారు.

వివరాలు 

వంటనూనె వ్యాపారం రద్దు దిశగా.. 

ఇక, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఇరుదేశాలు నౌకలపై ప్రత్యేక ఫీజులు విధించాయి. ఈ పరిణామంలో, ట్రంప్ వంటనూనె వ్యాపారాలను రద్దు చేయడానికి యోచిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా రైతుల నుంచి చైనా సోయాబీన్లను ఉద్దేశపూర్వకంగా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ఆర్థిక ఉద్రిక్తతలను తగ్గించడానికి వంటనూనె వ్యాపారాన్ని నిలిపివేయాలనుకుంటున్నట్లు చెప్పారు. చైనా వంటనూనెకి అమెరికా అవసరం లేదని స్పష్టపరిచారు. బ్రిక్స్‌ కూటమి.. డాలర్‌పై దాడే: ఈ నేపథ్యంలో, ట్రంప్ బ్రిక్స్‌ కూటమిపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ కూటమి డాలర్‌పై దాడి చేసేందుకు ఏర్పాటు చేయబడిందని గుర్తుచేశారు. బ్రిక్స్‌లో చేరదలచిన దేశాలపై అమెరికా టారిఫ్‌లను విధిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఆ కూటమి విభజన చెందుతుందని విమర్శించారు.