LOADING...
UAE Lucky Day Lottery: యూఏఈ లాటరీలో ఇద్దరికి లక్ష దిర్హమ్‌ల బహుమతి
యూఏఈ లాటరీలో ఇద్దరికి లక్ష దిర్హమ్‌ల బహుమతి

UAE Lucky Day Lottery: యూఏఈ లాటరీలో ఇద్దరికి లక్ష దిర్హమ్‌ల బహుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూఏఈలో బుధవారం నిర్వహించిన 'లక్కీ డే' లాటరీ డ్రా నంబర్ 260513 ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఈ డ్రాలో పలువురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకున్నప్పటికీ, అత్యంత భారీగా ప్రకటించిన 30 మిలియన్ దిర్హమ్‌ల ప్రధాన బహుమతిని మాత్రం ఎవరూ దక్కించుకోలేకపోయారు. ఈ డ్రాలో 'డేస్' విభాగంలోని ఐదు సంఖ్యలను, 'నెల' విభాగంలోని ఒక సంఖ్యతో సరిపోల్చిన ఇద్దరు విజేతలు తృతీయ బహుమతిని సొంతం చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి లక్ష దిర్హమ్‌లు లభించాయి. భారత కరెన్సీ ప్రకారం ఇది రూ.22 లక్షలకు పైగా ఉంటుంది. డ్రా నంబర్ 260513లో 'డేస్' విభాగంలో 9, 25, 2, 16, 23, 5 సంఖ్యలు, 'నెల' విభాగంలో 7 విజేత సంఖ్యగా ప్రకటించారు.

వివస్ర్తాలు 

మరోసారి వాయిదా పడిన భారీ బహుమతులు

అదే విధంగా గ్యారెంటీడ్ బహుమతి విభాగంలో ముగ్గురు అదృష్టవంతులు ఒక్కొక్కరు 50 వేల దిర్హమ్‌లు గెలుచుకున్నారు. వారి లక్కీ ఛాన్స్ గుర్తింపు సంఖ్యలు BE2946839, AT1839187, AY2300136గా వెల్లడించారు. ఈ వారం కూడా 30 మిలియన్ దిర్హమ్‌ల ప్రధాన బహుమతితో పాటు, 5 మిలియన్ దిర్హమ్‌ల ద్వితీయ బహుమతికి విజేతలు ఎవరూ లేరు. దీంతో ఈ రెండు భారీ బహుమతుల మొత్తాలు తదుపరి డ్రాకు బదిలీ అయ్యాయి. తదుపరి డ్రా ఎప్పుడు? యూఏఈ లాటరీ తదుపరి డ్రా మే 16న శనివారం నిర్వహించనున్నారు. వారానికి రెండుసార్లు జరిగే ఈ డ్రాలో పాల్గొనే వారికి భారీ నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది.

Advertisement