London: యూకే వైమానిక స్థావరంపై ఉగ్రదాడి కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌లోని కీలక వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి జరిగిన కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న దాడులకు ఉపయోగిస్తున్న గ్లౌసెస్టర్‌షైర్ సమీపంలోని ఫెయిర్‌ఫోర్డ్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను పేల్చివేసేందుకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు భావిస్తున్న మూడు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాల్లో ఉన్న పేలుడు పదార్థాలు పేలితే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థావరం సమీపంలోని 85 ఇళ్లను ఖాళీ చేయించారు. పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకుని ముప్పును నివారించిన పోలీసు ప్రత్యేక బృందాలను బ్రిటన్ రక్షణ మంత్రి వెస్ స్ట్రీటింగ్ అభినందించారు.
వివరాలు
ఇరాన్‌పై దాడులకు బేస్ వినియోగం
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ దాడుల్లో అమెరికా తన బీ-1బీ వంటి అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాలను ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం నుంచే ఇరాన్‌పైకి పంపుతోంది.
దీంతో ఈ స్థావరం ప్రస్తుతం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది.
వివరాలు
ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అనుమానాలు
అమెరికాకు మద్దతుగా నిలిచే దేశాల సైనిక స్థావరాలపై దాడులు తప్పవని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ జూలైలో హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఫెయిర్‌ఫోర్డ్ స్థావరంపై దాడికి ప్రయత్నం వెనుక ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ లేదా రష్యా అనుకూల శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దాడి కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థపై దర్యాప్తు కొనసాగుతోంది.