Loading...
UK: సోషల్ మీడియాపై బ్రిటన్ కొరడా.. చిన్నారుల రక్షణకు కొత్త చట్టం
సోషల్ మీడియాపై బ్రిటన్ కొరడా.. చిన్నారుల రక్షణకు కొత్త చట్టం

UK: సోషల్ మీడియాపై బ్రిటన్ కొరడా.. చిన్నారుల రక్షణకు కొత్త చట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నారులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడటం కంటే.. సామాజిక మాధ్యమ వేదికలే చిన్నారులకు అందుబాటులో లేకుండా చేసే దిశగా బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని మరే దేశంలోనూ లేని విధంగా బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు ఆ దేశ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ వెల్లడించారు. ఈ మేరకు ప్రతిపాదిత శాసనాన్ని త్వరలోనే బ్రిటన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. చిన్నారులు డిజిటల్‌ పరికరాలను ఉపయోగించే విధానంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 18ఏళ్లలోపు వారిని గుర్తించే సాంకేతిక వ్యవస్థలను సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి గ్యాడ్జెట్లలోనే అంతర్గతంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు 

అశ్లీల దృశ్యాలను గుర్తించే ఫిల్టర్లు

అదే సమయంలో నగ్న చిత్రాలు, అసభ్యకరమైన లేదా అశ్లీల దృశ్యాలను గుర్తించే ఫిల్టర్లు పరికరాల్లో స్వయంచాలకంగా పనిచేసేలా సాంకేతిక కంపెనీలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న టెక్నాలజీ సంస్థలకు ఈ బాధ్యతను కొత్త చట్టం ద్వారా నిర్దేశించనున్నట్లు తెలిపారు.

18 ఏళ్లలోపు వారెవరు? ఆ వయసు దాటినవారెవరు? అనే విషయాన్ని గుర్తించే సదుపాయం ఆయా డిజిటల్‌ పరికరాల్లో ఉండేలా చూడాల్సిన బాధ్యత తయారీదారులైన సాంకేతిక సంస్థలపైనే ఉంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

తద్వారా చిన్నారులకు వయోజనులకు ఉద్దేశించిన కంటెంట్‌ చేరకుండా ముందుగానే నియంత్రించే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

వివరాలు 

ప్రతిపాదిత చట్టం ద్వారా టెక్నాలజీ కంపెనీలపై మరింత బాధ్యతలు

నగ్న చిత్రాలు, అసభ్యకరమైన, అశ్లీల దృశ్యాలు చిన్నారుల కంటపడకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని తెలిపారు.

అంతేకాకుండా ఇతరులు అలాంటి కంటెంట్‌ను చిన్నారులకు పంపించే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పిల్లలు కూడా ఇలాంటి కంటెంట్‌ను ఇతరులకు పోస్ట్‌ చేసే పరిస్థితి రాకుండా సాంకేతికంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

బాలల ఆన్‌లైన్‌ భద్రత విషయంలో ప్రభుత్వం కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితం కాదని బ్రిటన్‌ సాంస్కృతిక శాఖ మంత్రి లీసా నాండీ స్పష్టం చేశారు.

చిన్నారులను హానికరమైన డిజిటల్‌ కంటెంట్‌ నుంచి రక్షించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రతిపాదిత చట్టం ద్వారా టెక్నాలజీ కంపెనీలపై మరింత బాధ్యతలు పెట్టేందుకు బ్రిటన్‌ సిద్ధమవుతోంది.

ADVERTISEMENT