Loading...
Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. అగ్నికి ఆహుతైన భారీ గిడ్డంగులు!
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. అగ్నికి ఆహుతైన భారీ గిడ్డంగులు!

Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. అగ్నికి ఆహుతైన భారీ గిడ్డంగులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ డ్రోన్ దాడులకు తెగబడింది. శనివారం రష్యాలోని పలు నగరాల్లో ఉన్న భారీ నిల్వ కేంద్రాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌లతో దాడులు నిర్వహించింది. ఈ ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయపడినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ కొంతకాలంగా ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై వరుసగా డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది.

వివరాలు

కీలక ప్రాంతాలను టార్గెట్ చేసిన ఉక్రెయిన్

అదే వ్యూహంలో భాగంగా ఈసారి కూడా కీలక ప్రాంతాలను టార్గెట్ చేసింది.

మాస్కోతో పాటు టాంబోవ్స్క్ ప్రాంతంలో ఉన్న రష్యా అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగులపై కూడా ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడి చేశాయి.

ఈ దాడుల ప్రభావంతో సుమారు 1.88 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన భారీ గిడ్డంగి పూర్తిగా అగ్నికి ఆహుతైందని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT