UNO : భద్రతా మండలిలో అత్యవసర తీర్మానం ఆమోదం.. గాజాలో మానవతావాద కాల్పుల విరమణ
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు మానవతావాద కాల్పుల విరమణ కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానం ఆమోదం పొందింది. 15 మంది సభ్యుల కౌన్సిల్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంలో 12-0తో తీర్మానం ఆమోదం పలికింది. ఈ మేరకు అమెరికా(యునైటెడ్ స్టేట్స్),యూకే (యునైటెడ్ కింగ్‌డమ్),రష్యా దేశాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత UN భద్రతా మండలి బుధవారం మొదటి తీర్మానాన్ని ఆమోదించింది. పెరుగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గాజాలో అత్యవసర మానవతా కాల్పుల విరమణలకు యూఎన్ఓ పిలుపునిచ్చింది. అక్టోబరు 7న హమాస్ దాడిని ఖండించడంలో తీర్మానం విఫలమైంది. దీంతో అగ్రదేశాలు అమెరికా, UK, రష్యా తాజా ఓటింగ్ కు డుమ్మా కొట్టాయి.