
Yemen: యెమెన్‌ను లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు.. 50 స్థావరాలపై బాంబుల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా యుద్ధ విమానాలు శనివారం రాత్రి యెమెన్ రాజధాని సనా సహా పలు కీలక నగరాలపై భీకర బాంబుల వర్షం కురిపించాయి.
ఈ దాడుల్లో సనా, హోదైద, అమ్రాన్ నగరాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. దాదాపు 50 స్థావరాలను ధ్వంసం చేసినట్లు 'అల్-అరేబియా' పత్రిక వెల్లడించింది.
హోదైదలోని పోర్టు, విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమయ్యాయని హూతీ తిరుగుబాటు దళాలు చెబుతున్నాయి.
ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని సమాచారం. ఆపద పరిహార చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా దాడులపై అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ, తమ దాడులు ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
Details
ట్రంప్ ఆదేశాల మేరకే దాడులు
ఇటీవలే ఎర్ర సముద్రంలో జరిగిన దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోగా, 171 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటివరకు హూతీలపై జరిగిన దాడుల్లో ఇది అత్యంత ఘోరమైన దాడిగా చెబుతున్నారు.
ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందిస్తూ, ఇది తీవ్ర ఆందోళనకు కారణమని వ్యాఖ్యానించారు.
హూతీ రెబల్స్‌పై కఠినంగా వ్యవహరించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల ప్రకారమే ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.