US new tariffs: భారత్ సహా 14 దేశాలపై అమెరికా కొత్త టారిఫ్‌లు.. చైనాపై అత్యధికంగా 40 శాతం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో పాటు మరో 14 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్తగా సుంకాలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం అవసరానికి మించి ఉండటాన్ని నియంత్రించడమే ఈ చర్యల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా చైనా తక్కువ ధరలకు భారీగా వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లలోకి పంపుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాపై అత్యధిక సుంకాలు విధించాలని నిర్ణయించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఈ వివరాలను ప్రచురించింది.
వివరాలు
చైనాపై అదనంగా 20 శాతం సుంకం
ఈ ప్రతిపాదనల ప్రకారం చైనా, బంగ్లాదేశ్, కంబోడియా, యూరోపియన్ యూనియన్, భారత్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కొత్త సుంకాలు విధించనున్నారు.
చైనాపై అదనంగా 20 శాతం సుంకం విధించాలని ప్రతిపాదించారు.
గతంలో ట్రంప్ తొలి పదవీకాలంలో విధించిన సుంకాలకు ఇది అదనం కానుంది.
అయితే ప్రస్తుతానికి మెక్సికో, నార్వే దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎలాంటి కొత్త సుంకాలను ప్రతిపాదించలేదు.
ఏయే దేశాలపై ఎంత శాతం సుంకాలు విధించనున్నారనే పూర్తి వివరాలను బుధవారం అమెరికా ఫెడరల్ రిజిస్టర్‌లో అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు సమాచారం.