Loading...
US-Iran: ఐదు ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్లపై అమెరికా దాడి.. జోర్డాన్‌పై విరుచుకుపడ్డ టెహ్రాన్
జోర్డాన్‌పై విరుచుకుపడ్డ టెహ్రాన్

US-Iran: ఐదు ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్లపై అమెరికా దాడి.. జోర్డాన్‌పై విరుచుకుపడ్డ టెహ్రాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా నేవీకి చెందిన యుద్ధనౌకపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (IRGC) వరుసగా రెండుసార్లు బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. ప్రతిదాడిలో భాగంగా ఇరాన్‌కు చెందిన ఐదు ముడి చమురు రవాణా నౌకలను ధ్వంసం చేసినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) వెల్లడించింది.

వివరాలు 

రెండు రోజుల్లో రెండుసార్లు దాడి యత్నం

గత రెండు రోజుల వ్యవధిలో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్‌ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించినట్లు CENTCOM తెలిపింది.

అయితే ఈ రెండు దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకున్నట్లు పేర్కొంది.

అనంతరం ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించిందని వెల్లడించింది.

ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌ తాజా దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగానే ఐదు చమురు నౌకలపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.

వివరాలు 

ఐదు చమురు నౌకలే లక్ష్యం

ఐఆర్‌జీసీకి చెందిన చమురు అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు అమెరికా ఆరోపించిన M/T Kaviz, M/T Charminar,M/T Horizon 1,M/T Riesco నౌకలను గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో లక్ష్యంగా చేసుకున్నట్లు CENTCOM వెల్లడించింది.

మరో నౌక M/T Deryaను ఇరాన్‌లోని ఖార్గ్‌ ఐలాండ్‌ సమీపంలో దాడి చేసినట్లు తెలిపింది.

ఈ చర్యలకు ముందు ఆయా నౌకల్లోని సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా బలగాలు ఆదేశించాయని CENTCOM పేర్కొంది.

సిబ్బంది తరలింపు అనంతరం నౌకలను పనికిరాకుండా చేసినట్లు వివరించింది.

ఇరాన్‌ నుంచి పెద్ద మొత్తంలో చమురును అక్రమంగా తరలిస్తూ, ఐఆర్‌జీసీతో పాటు దాని ప్రాంతీయ మద్దతుదారులకు నిధులు సమకూర్చే బహుళ బిలియన్‌ డాలర్ల 'షాడో ఫ్లీట్‌'లో ఈ నౌకలు భాగమని అమెరికా ఆరోపించింది.

ADVERTISEMENT

వివరాలు 

సెప్టెంబర్‌ 5న మరో మూడు నౌకలపై దాడి

ఇదే తరహాలో సెప్టెంబర్‌ 5న కూడా అమెరికా మూడు ఇరాన్‌ చమురు నౌకలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

ఆ సమయంలో అమెరికా విమాన వాహక నౌక, గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌పై ఐఆర్‌జీసీ దాడికి ప్రయత్నించిందని CENTCOM పేర్కొంది.

ఇప్పటివరకు అమెరికా నేవీ నౌకలపై ఇరాన్‌ చేసిన అన్ని దాడి ప్రయత్నాలు విఫలమయ్యాయని వెల్లడించింది.

అయితే ఇరాన్‌ ప్రభుత్వ మీడియా మాత్రం అమెరికా తాజాగా జరిపిన దాడుల్లో రెండు చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నట్లు తెలిపింది.

ఒక నౌక జాస్క్‌ సమీపంలో, మరో నౌక ఖార్గ్‌ ఐలాండ్‌ సమీపంలో దాడికి గురైనట్లు పేర్కొంది.

ఆయా నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు, ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

పెరగనున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు?

తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో కువైట్‌, బహ్రెయిన్‌ నౌకాశ్రయాల సమీపంలో ప్రయాణించే చమురు నౌకలపై ఇరాన్‌ దాడులు చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అమెరికా నేవీ నౌకలపై ఇరాన్‌ మరోసారి దాడికి ప్రయత్నిస్తే.. ప్రతిసారీ మరిన్ని చమురు ట్యాంకర్లను ఇరాన్‌ కోల్పోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ ఐదు చమురు నౌకలను ధ్వంసం చేసిన అమెరికా

ADVERTISEMENT