
US-China Trade War: సముద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్ వార్.. నౌకలపై ప్రత్యేక ఫీజులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా,చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రకారం, బీజింగ్‌పై అదనంగా 100% సుంకాలు (Trump Tariffs) విధించారు. ఈ ప్రకటన తర్వాత, ఇరుదేశల మధ్య వాణిజ్య యుద్ధం (US-China Trade War) మరోసారి ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో, రెండు దేశాలూ నౌకలపై ప్రత్యేక ఫీజులు విధించే నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా యాజమాన్యంలో ఉన్న నౌకలు, లేదా యూఎస్ జెండాతో వచ్చే ఓడలపై ప్రత్యేక చార్జీలను వసూలు చేస్తున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది. అయితే, చైనా నిర్మించిన నౌకలకు ఈ ఫీజులు వర్తించవు అని స్పష్టంగా పేర్కొంది. అటువంటి పరిస్థిలో, అమెరికా కూడా తన వైపున ఈ ఫీజులను నేటినుంచి అమల్లోకి తెచ్చింది.
వివరాలు
చివరివరకూ పోరాడతాం: చైనా
మరోవైపు, అమెరికా అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించింది. వాణిజ్య యుద్ధం,టారిఫ్‌ల విషయంలో మా వైఖరి స్థిరంగా ఉంది. మీరు (అమెరికాను ఉద్దేశించి) యుద్ధం కోరుకుంటే మేం చివరివరకూ పోరాడతాం. మరి చర్చలు జరపాలనుకుంటే, మా తలుపులు తెరిచే ఉన్నాయి" అని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. చైనా ఇటీవల ప్రపంచంలో అరుదుగా లభించే కొన్ని ఖనిజాల ఎగుమతిపై నియంత్రణలు విధించింది. ఇకపై,విదేశీ కంపెనీలు వీటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌లపై నియంత్రణలు
ఈ నిర్ణయం ట్రంప్ అధ్యక్షునికి కోపాన్ని కలిగించింది.దీంతో,బీజింగ్‌పై 100% అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ సుంకాలు నవంబర్ 1 నుంచి లేదా అవసరమైతే మరింత ముందే అమల్లోకి వస్తాయి. అదనంగా,చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌లపై నియంత్రణలు కూడా విధిస్తామని అధికారులు వెల్లడించారు.