
H-1B Visa: హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌పై షట్‌డౌన్ ఎఫెక్ట్.. ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ నేపథ్యంలో హెచ్-1బీ వీసాల ప్రక్రియపై ప్రభావం పడనున్నది. ప్రభుత్వ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నిలిపివేయడం, వివిధ కార్యాలయాలను తాత్కాలికంగా మూతపెట్టడం వలన వీసా ప్రక్రియ కూడా ఆగిపోతుందని ఇమిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునర్ తెలిపారు. షట్‌డౌన్ ముగిసిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఫెడరల్ నిధుల కేటాయింపులు లేకపోవడం వలన వీసాల ప్రక్రియ నిలిచిపోతుందని నిపుణులు తెలిపారు. హెచ్-1బీ వీసాల కేటాయింపుకు ముందుగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వద్ద "లేబర్ కండీషన్ అప్లికేషన్" దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు ఆమోదమయ్యాకే, ఆ కంపెనీ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు (USCIS) వద్ద హెచ్-1బీ పిటిషన్‌ను సమర్పిస్తుంది.
వివరాలు
అమెరికా, విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో పరిస్థితి సహకరించినంత వరకు కార్యకలాపాలు జరుగుతాయి
USCIS తమ కార్యకలాపాలను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజుల ద్వారా నిర్వహిస్తాయి కాబట్టి, వాటిపై షట్‌డౌన్ ప్రభావం ఉండదు. కానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌కి ఫెడరల్ నిధులు కేటాయించబడతాయి. అందువల్ల లేబర్ కండీషన్ అప్లికేషన్ ధృవీకరణ పొందడం కష్టం అవుతుంది. ఫలితంగా, కొత్త హెచ్-1బీ వీసాల కేటాయింపు, సంస్థల మార్పులు, వీసా స్టేటస్ మార్పులు వంటి ప్రక్రియలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. భారతదేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం ఈ పరిస్థితిపై స్పందించింది. షట్‌డౌన్ కొనసాగుతున్నప్పటికి, అమెరికా, ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాలు సాధ్యమైనంతవరకు కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలిపింది. అయితే, తాజా అప్‌డేట్లు, సమాచారం ట్విట్టర్ ఖాతాల్లో అందుబాటులో ఉండవని పేర్కొంది.