LOADING...
US-Iran: ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ చర్చలు 
ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ చర్చలు

US-Iran: ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ చర్చలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2026
07:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని లక్ష్యంగా అమెరికా,ఇరాన్ దేశాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో శనివారం సాయంత్రం ఈ సమావేశం మొదలైనట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఖేర్ ఖలీబాఫ్,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు చర్చల్లో పాల్గొంటున్నాయి. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం,లెబనాన్ లో పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలు, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, అలాగే హర్మూజ్ జలసంధి అంశం ఈ చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా పాటించడం లేదని, దీనిపై అమెరికా బాధ్యత వహించాలని ఇరాన్ ప్రతినిధులు కోరుతున్నట్లు సమాచారం.

వివరాలు 

ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే ఒప్పందం కుదరదు 

ఇదే సమయంలో ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్-రెజా అరెఫ్ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే ఎలాంటి ఒప్పందం కుదరదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ అజెండా ప్రాధాన్యంగా మారితే తమ రక్షణ చర్యలను మరింత పెంచుతామని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు జరిపి సుప్రీం లీడర్ అలీ ఖమేనీను హతమార్చిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

వివరాలు  

చర్చలు ప్రారంభానికి ముందు ఇరాన్‌ ఆస్తుల విడుదల

దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. బుధవారం నుంచి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడులు జరిపి 300 మందికి పైగా పౌరులను హతమార్చింది. చర్చలు ప్రారంభానికి ముందు ఇరాన్‌కు చెందిన ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని తస్నిమ్ తెలిపింది. అయితే, ఈ వార్తలను అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఖండించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

Advertisement