LOADING...
US-Iran: ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం
ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం

US-Iran: ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ విషయంలో అమెరికా తన దూకుడును కొంత తగ్గించినట్లుగా కనిపిస్తోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి చంపిన ఘటనల నేపథ్యంలో అమెరికా సైన్యం రంగంలోకి దిగనుందనే వార్తలు గతంలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీనితో ఒక్కసారిగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. అయితే తాజా పరిణామాలతో పరిస్థితులు కొంత శాంతించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు సిద్ధమవుతున్న ప్రణాళికను రద్దు చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలోనే అమెరికా ఈ సైనిక ప్రణాళికను విరమించుకున్నట్లు సమాచారం. ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్య చేపట్టబోమని అధ్యక్షుడు ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Details

డిసెంబర్‌ 28 నుంచి ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ తమ గగనతలాన్ని తిరిగి తెరిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్‌ 28 నుంచి ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు కాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు అధికారికంగా సుమారు 3 వేల మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాస్తవ సంఖ్య దీనికన్నా ఎక్కువగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు నిరసనకారులపై చేపట్టిన ఉరితీత కార్యక్రమం కూడా నిలిచిపోయినట్లు సమాచారం.

Advertisement