Rubio: ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా దౌత్య ప్రయత్నాలు: రూబియో
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 24, 2026
08:57 am
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న "అర్థరహిత యుద్ధానికి" ముగింపు పలికేందుకు ట్రంప్ యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే ఈ సంక్షోభానికి వెంటనే పరిష్కారం లభించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఆలోచనలు,నిరంతర దౌత్య చర్చల ద్వారానే ఈ యుద్ధానికి ముగింపు దిశగా ముందుకు సాగవచ్చని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో సమావేశమైన అనంతరం రూబియో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తుందని, శాంతి స్థాపన కోసం అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యుద్ధం ముగిసేలా కొత్త మార్గాలపై అమెరికా దృష్టి: రూబియో
Rubio: You think we settled the war in Ukraine in 30 minutes? That's not the way it works. pic.twitter.com/3Yk2L0mL8U
— Headquarters (@HQNewsNow) July 23, 2026