Donald Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. వలసదారుల తరలింపుపై బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు పంపించే విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ బ్రియాన్ మర్ఫీ కీలక తీర్పు వెలువరించారు. పదవిలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న వలసదారులను గ్వాటమాల, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి దేశాలకు తరలించే చర్యలు చేపట్టారు.
వివరాలు
ట్రంప్ ప్రభుత్వం కు 15 రోజుల గడువు
ఈ తరలింపును వ్యతిరేకిస్తూ బాధిత వలసదారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తగిన సమయం కల్పించకుండా సంబంధం లేని దేశాలకు పంపించడం చట్టానికి విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం కు 15 రోజుల గడువు ఇచ్చింది.