
US Man: రోచెస్టర్ హిల్స్‌లోని బ్రూక్‌లాండ్స్ మళ్లీ గర్జించిన తుపాకీ.. పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మిచిగాన్‌లోని పిల్లల వాటర్ పార్క్‌లో ఒక సాయుధుడు శనివారం సాయంత్రం కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పిల్లలు,వారిలో ఒకరు 8సంవత్సరాల వయస్సువున్నవారు పలువురు గాయపడ్డారు.
సమీపంలోని ఇంటిలో దాక్కున్న షూటర్‌ను పోలీసులు చుట్టుముట్టారని ఓక్లాండ్ కౌంటీ షెరీఫ్ మైఖేల్ బౌచర్డ్ తెలిపారు.
రోచెస్టర్ హిల్స్‌లోని బ్రూక్‌లాండ్స్ ప్లాజా స్ప్లాష్ ప్యాడ్‌లో జరిగిన కాల్పుల్లో"తొమ్మిది,బహుశా 10" మంది దాకా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
"రోచెస్టర్ హిల్స్‌లోని అబర్న్‌లోని స్ప్లాష్ ప్యాడ్‌లో ఇప్పటికీ ఘటనా స్ధలానికి ,సమీపంలో అనుమానితుడు ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని కోరామని పోలీసు డిపార్ట్‌మెంట్ తెలిపింది. మాకు చాలా మంది గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించామని డిపార్ట్‌మెంట్ X లో పోస్ట్‌లో పేర్కొంది.
వివరాలు
28 సార్లు కాల్పులు జరిపిన ఆగంతకుడు
ఓ అనుమానితుడు శనివారం సాయంత్రం 5 గంటలకు స్ప్లాష్ ప్యాడ్‌కు చేరుకుని తన వాహనం నుండి దిగిన తర్వాత కాల్పులు జరిపాడు.
నిందితుడు తన తుపాకీని చాలాసార్లు రీలోడ్ చేసి, 28 సార్లు కాల్పులు జరిపాడు, పోలీసు అధికారి చెప్పారు.
కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ, దాడి యాదృచ్ఛికంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు భద్రత కల్పించారని రోచెస్టర్ హిల్స్ మేయర్ బ్రయాన్ కె. బార్నెట్ తెలిపారు.
"రోచెస్టర్ హిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సంఘటనా స్థలంలో ఉంది. ఘటనా స్థలం సురక్షితంగా ఉంది. ప్రతి ఒక్కరి సంయమనాన్ని అభినందిస్తున్నామన్నారు. 2024లో, యునైటెడ్ స్టేట్స్ ఇప్పటివరకు 215 సామూహిక కాల్పులు జరిగాయి.