Page Loader
Maine mass shooting: 18మందిని చంపిన హంతకుడు ఆత్మహత్య.. మృతదేహం గుర్తింపు
Maine mass shooting: 18మందిని చంపిన హంతకుడి మృతదేహం గుర్తింపు

Maine mass shooting: 18మందిని చంపిన హంతకుడు ఆత్మహత్య.. మృతదేహం గుర్తింపు

వ్రాసిన వారు Stalin
Oct 28, 2023
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని మైనేలో 18మందిని చంపినట్లు అనుమానిస్తున్న రాబర్ట్ కార్డ్ చనిపోయినట్లు పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు. రాబర్ట్ కోసం ఎఫ్‌బీఐ బృందాలు రెండు రోజులుగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు 48 గంటల తర్వాత అతను చనిపోయినట్లు దృవీకరించారు. రాబర్ట్ కార్డ్ తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయినట్లు, శుక్రవారం రాత్రి 7:45గంటలకు మృతదేహాన్ని గుర్తించినట్లు సౌషుక్ పేర్కొన్నారు. మైనేలోని ఈ హార్డ్-స్క్రాబుల్ సిటీలో బౌలింగ్ అల్లే, బార్-రెస్టారెంట్‌లో బుధవారం సాయంత్రం జరిగిన తుపాకీ కాల్పుల్లో 18 మంది మరణించారు. 13మంది గాయపడ్డారు. ఈ కాల్పులు జరిపింది రాబర్ట్ కార్డ్ అని అమెరికా ఏజెన్సీలు అనుమానించి, అతని కోసం వేట కొనసాగించాయి. ఈ క్రమంలో అతను చనిపోయవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

48గంటల తర్వాత మృతదేహం గుర్తింపు