Loading...
US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా సైన్యంలో 14 మంది మృతి, 414 మందికి గాయాలు
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా సైన్యంలో 14 మంది మృతి, 414 మందికి గాయాలు

US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా సైన్యంలో 14 మంది మృతి, 414 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం ప్రాణనష్టంతో పాటు గాయాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తాజా సమాచారం వెల్లడైంది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (USCENTCOM)విడుదల చేసిన నివేదికలో యుద్ధ పరిస్థితులపై తాజా వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం,ఈ ఘర్షణలో ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 14కు చేరింది. ఈ సంఖ్య పెరగడానికి జూలై 1న అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదమే కారణమని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో అమెరికా నేవీకి చెందిన ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలు 

గాయపడిన వారిలో అత్యధిక మందికి 'ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ'

అయితే ఈ ఘటన శత్రు దాడి ఫలితంగా జరగలేదని, హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో ప్రమాదం సంభవించినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది.

మరోవైపు, సోమవారం నాటికి గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య 414కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ, గాయపడిన వారిలో అత్యధిక మంది 'ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ' (మెదడుకు తీవ్రమైన గాయాలు) సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు.

యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యంలో ప్రాణనష్టం, గాయాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా సైన్యంలో 14 మంది మృతి, 414 మంది గాయాలు

ADVERTISEMENT