Loading...
Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం

Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా భారీగా సైనిక ఆయుధ నష్టాన్ని చవిచూసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా సైన్యానికి చెందిన 81 సైనిక విమానాలు దెబ్బతిన్నట్లు లేదా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ నష్టం విలువ దాదాపు రూ.31 వేల కోట్లుగా ఉంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నష్టాల్లో అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. F-35A లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్‌తో పాటు 12 F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో విమానం విలువ సుమారు రూ.289 కోట్లు ఉండే నాలుగు F-15 జెట్‌లు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.

వివరాలు 

MQ-9 రీపర్ డ్రోన్లకు భారీ నష్టం

సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల్లో మరో ఎనిమిది F-15E జెట్‌లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

అయితే వాటికి మరమ్మతులు పూర్తిచేసి తిరిగి సైనిక సేవల్లోకి తీసుకొచ్చినట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు.. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్లకు కూడా భారీ నష్టం వాటిల్లింది.

ఒక్కో డ్రోన్ విలువ 30 నుంచి 50 మిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది.

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇప్పటివరకు 45 MQ-9 రీపర్ డ్రోన్లు ధ్వంసమైనట్లు సమాచారం.

నిఘా కార్యకలాపాలతో పాటు క్షిపణి దాడులకు కీలకంగా ఉపయోగించే ఈ డ్రోన్లు ప్రస్తుతం అమెరికా వద్ద 135 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

F-35A విమానం, E-3 సెంటినల్ నిఘా విమానాన్ని కోల్పోయిన అమెరికా

గతంలో అమెరికా వైమానిక దళం వద్ద ఏ సమయంలోనైనా కనీసం 189 MQ-9 రీపర్ డ్రోన్లు ఉండేవి.

దీంతో ప్రస్తుత నష్టాల ప్రభావం అమెరికా డ్రోన్ సామర్థ్యంపై పడినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌పై జరిగిన దాడుల్లో అమెరికా తన అధునాతన సైనిక విమానాల్లో ఒకటైన ఐదోతరం F-35A విమానంతో పాటు E-3 సెంటినల్ నిఘా విమానాన్ని కూడా కోల్పోయినట్లు సమాచారం.

అయితే అమెరికా సైనిక విమానాలు, డ్రోన్లకు జరిగిన మొత్తం నష్టంపై అధికారికంగా పూర్తి గణాంకాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా కోల్పోయిన కీలక ఫైటర్‌ జెట్లు..

ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు-12

ఎఫ్-35ఏ లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం-1

ఏ-10 వార్‌థాగ్ దాడి విమానాలు-2

కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ గగనతల ఇంధన సరఫరా విమానాలు-7

ఈ-3 సెంట్రీ గూఢచార విమానం-1

ఎంసీ-130జే కమాండో II ప్రత్యేక కార్యకలాపాల విమానాలు-2

హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II యుద్ధ శోధన-రక్షణ హెలికాప్టర్-1

ఎంక్యూ-4సీ ట్రైటాన్ అధిక ఎత్తులో ఎక్కువసేపు ఎగిరే డ్రోన్-1

ఎంక్యూ-1 బహుళ ప్రయోజన డ్రోన్‌లు-3

ఏహెచ్-64 అపాచీ దాడి హెలికాప్టర్-1

ఏహెచ్-6 లిటిల్ బర్డ్ తేలికపాటి దాడి హెలికాప్టర్లు-4

ఎంహెచ్-60 సీ హాక్ సముద్ర హెలికాప్టర్-1

ADVERTISEMENT