LOADING...
US Plane: అమెరికాలోని జార్జియాలో రద్దీ రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్
అమెరికాలోని జార్జియాలో రద్దీ రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్

US Plane: అమెరికాలోని జార్జియాలో రద్దీ రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా జార్జియా రాష్ట్రంలో ఓవిమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో,ఓ చిన్న శిక్షణ విమానాన్ని పైలట్ రద్దీగా ఉన్న ప్రధాన రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈసమయంలో విమానం రహదారిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఈఘటన గెయిన్స్‌విల్ నగర పరిధిలో చోటుచేసుకుంది.ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం,గెయిన్స్‌విల్‌లోని లీ గిల్మర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కాంటన్‌లోని చెరోకీ కౌంటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌కు శిక్షణ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉన్నట్టు పైలట్ గుర్తించారు. వెంటనే తిరిగి విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రయత్నించినప్పటికీ,విమానానికి అవసరమైన శక్తి సరిపోకపోవడంతో గెయిన్స్‌విల్‌లోని రద్దీ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

ల్యాండింగ్ సమయంలో పలు వాహనాలను ఢీకొట్టిన విమానం

ల్యాండింగ్ సమయంలో విమానం కుడి రెక్క ఓ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో విమానం నుంచి ఇంధన ట్యాంక్ విడిపోయి పక్కనే ఉన్న మరో ఎస్‌యూవీ వాహనంపై పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆ రహదారిని మూసివేసి, ట్రాఫిక్‌ను ఇతర మార్గాల వైపు మళ్లించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో ఇంజిన్ సమస్యపై తమకు సమాచారం అందిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో కలిసి సమగ్ర దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికాలో రద్దీ రోడ్డుపై దిగిన‌ విమానం..

Advertisement