Page Loader
భారత్ అధ్యక్షతన G-20 శిఖరాగ్ర సమావేశాలు సంపూర్ణ విజయవంతం : అమెరికా
భారత్ G-20 సదస్సు గ్రాండ్ సక్సెస్ : అమెరికా

భారత్ అధ్యక్షతన G-20 శిఖరాగ్ర సమావేశాలు సంపూర్ణ విజయవంతం : అమెరికా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 12, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

G-20 శిఖరాగ్ర సమావేశంపై అమెరికా ప్రశంసల జల్లును కురిపించింది. ఆదివారం భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన ప్రపంచ దేశాధినేతల సమావేశాలు అట్టహాసంగా ముగిశాయని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మథ్యూ మిల్లర్ జీ-20 సమావేశాల నిర్వహణ, భారత్ చొరవను ప్రశంసించారు. ఈ సమ్మిట్ ను సంపూర్ణ విజయంగా ఆయన పేర్కొన్నారు. సోమవారం అమెరికాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాగంగా మిల్లర్ పాల్గొన్నారు. అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. భారత్ లో నిర్వహించిన G-20 సమావేశం విజయవంతమైనట్లు తాము ఖచ్చితంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. G-20 అనేది ఓ పెద్ద సంస్థ అని, ఇందులో రష్యా, చైనా లాంటి దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారతదేశంలో జీ-20 సమావేశాలు గ్రాండ్ సక్సెస్ : అమెరికా