Loading...
US new tariffs: మరోసారి బాంబు పేల్చిన ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం టారిఫ్ విధింపు !
మరోసారి బాంబు పేల్చిన ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం టారిఫ్ విధింపు !

US new tariffs: మరోసారి బాంబు పేల్చిన ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం టారిఫ్ విధింపు !

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
08:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై మరోసారి సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి సామర్థ్యం కారణంగా అమెరికా వాణిజ్యానికి నష్టం జరుగుతోందన్న ఆరోపణలతో భారత వస్తువులపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) ప్రకటించిన తాజా ప్రతిపాదన ప్రకారం.. భారత్‌తో పాటు కంబోడియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్, థాయ్‌లాండ్ దేశాలు కూడా ఈ సుంకాల పరిధిలోకి రానున్నాయి. ఇతర దేశాలపై కూడా అమెరికా వేర్వేరు స్థాయిల్లో సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. వియత్నాంపై 35 శాతం వరకు, చైనాపై 40 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది.

వివరాలు 

అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకొని భారత్, వియత్నాం

బంగ్లాదేశ్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాలపై 20 శాతం వరకు సుంకాలు ప్రతిపాదించింది.

కంబోడియా,ఇండోనేషియా,మలేషియా,థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ దేశాలపై 18శాతం పన్నులు విధించాలని పేర్కొంది.

దక్షిణ కొరియా, తైవాన్, ఈయూ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలకు అత్యంత అనుకూల దేశ హోదా (MFN) కింద ఉన్న సుంకాలను మినహాయించి 15శాతం వరకు పరిమితిని ప్రతిపాదించింది.

భారత్, వియత్నాం దేశాలు ఇప్పటివరకు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోలేదు.

తాజాగా ప్రతిపాదించిన సుంకాలు వాణిజ్య చర్చలను వేగవంతం చేసే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.

డిసెంబరులో మియామీలో జరగనున్న జీ20 దేశాల నేతల సదస్సు నాటికి మరిన్ని వాణిజ్య ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

అమెరికా మళ్లీ సుంకాలు ఎందుకు విధిస్తోంది?

అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) మొత్తం 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ఎనిమిది నెలల పాటు విచారణ జరిపింది.

అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ దర్యాప్తు చేపట్టింది.

ఈ దేశాలు అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తున్నాయా? అనే అంశాన్ని పరిశీలించింది.

ప్రస్తుతం మెక్సికో, నార్వే దేశాలను ఈ సుంకాల ప్రతిపాదన నుంచి మినహాయించారు.

తయారీ రంగాల్లో అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించడం, కొనసాగించడం ద్వారా ఈ దేశాలు అమెరికా వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయని విచారణలో తేలినట్లు అమెరికా అధికారి వెల్లడించారు.

వివిధ విధానాలు, చర్యల ద్వారా ప్రపంచ మార్కెట్లలో అధిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

చైనాపై అత్యధిక సుంకాల భారం

ప్రతిపాదిత సుంకాల ప్రకారం చైనాపై అత్యధిక భారం పడనుంది.

పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కారణంగా చూపుతూ ప్రతిపాదించిన 20శాతం సుంకాలకు అదనంగా.. ట్రంప్ గతంలో విధించిన సుమారు 25శాతం సుంకాలు కూడా కొనసాగనున్నాయి.

అయితే బలవంతపు శ్రమకు సంబంధించిన చట్టాల అమలులో లోపాలు ఉన్నాయన్న ఆరోపణలతో జులైలో విధించిన 10శాతం లేదా 12.5శాతం సుంకాలపై మాత్రం కొత్త సుంకాలు అదనంగా విధించబోమని అమెరికా అధికారి తెలిపారు.

ఇప్పటికే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లోని పరిమితులకు లోబడే కొత్త సుంకాలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.

యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలకు 15 శాతం, మలేషియాకు 19 శాతం సుంకాల పరిమితి వర్తిస్తుందని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

2027 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం

ఒక్కో దేశంపై విధించబోయే కచ్చితమైన సుంకాల వివరాలను బుధవారం అమెరికా ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనున్నట్లు వెల్లడించింది.

ప్రతిపాదిత సుంకాలు వెంటనే అమల్లోకి రావు. ముందుగా ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు బహిరంగ విచారణ నిర్వహించనున్నారు.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. కొత్త సుంకాల అమలు 2027 జనవరి వరకు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధికారి సూచించారు.

ముఖ్యంగా చైనా ఉక్కు, అల్యూమినియం, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ ఉత్పత్తులు సహా ఇతర తయారీ వస్తువులను అధికంగా ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లలోకి పంపుతోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తమ ఎగుమతులు పోటీతత్వ ప్రయోజనాల ఆధారంగానే జరుగుతున్నాయని స్పష్టం చేసింది.

ADVERTISEMENT