Sonam Wangchuk: వాంగ్‌చుక్‌కు అమెరికాలో మద్దతు.. న్యూయార్క్, శాన్‌జోస్‌లో నిరసనలు
ఈ వార్తాకథనం ఏంటి
విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌కు విదేశాల్లోనూ మద్దతు వెల్లువెత్తుతోంది. అమెరికాలోని న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. మద్దతు తెలిపే ప్లకార్డులను ప్రదర్శించిన నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వాంగ్‌చుక్‌తో చర్చలు ప్రారంభించాలని కోరారు.
వివరాలు
దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రికి వాంగ్‌చుక్
అమెరికాతో పాటు బ్రిటన్‌లోని లండన్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో భారత రాయబార కార్యాలయం ఎదుట కూడా నిరసనలు నిర్వహించినట్లు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, 20 రోజులకుపైగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శనివారం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.