US: H-1B, L-1, EB-5 వీసాల ఫీజుల పెంపు.. భారతీయులపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే H-1B, L-1, EB-5 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు రుసుములను భారీగా పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
2016 తర్వాత అమెరికా వీసాల ఫీజును పెంచడం ఇదే తొలిసారి. అలాగే పెంచిన ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా వెల్లడించింది.
H-1B వీసా దరఖాస్తు రుసుము 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు అమెరికా పెంచించి. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి ఏకంగా 215 డాలర్లకు పెంచింది.
L-1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెరిగింది. EB-5 ఇన్వెస్టర్ వీసా ఫీజు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరిగింది.
వీసా
ఈ వీసాలను ఎలా జారీ చేస్తారంటే..
H-1B వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలు ఈ వీసాను ఆఫర్ చేస్తాయి.
భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను ఈ వీసాను ఆఫర్ చేసి, అమెరికా కంపెనీలు నియమించుకుంటాయి.
ఇంట్రా కంపెనీ బదిలీదారుల కోసం L-1 వీసాను జారీ చేస్తారు. బహుళజాతి కంపెనీలు తమ విదేశీ కార్యాలయాల నుంచి అమెరికాలో పని చేయడానికి తాత్కాలికంగా కొంతమంది ఉద్యోగులకు L-1 వీసాలను జారీ చేస్తారు.
EB-5 వీసాను విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా జారీ చేస్తుంది. 500,000 డాలర్లను పెట్టుబడి పెట్టిన వారికి EB-5 వీసాను అమెరికా అందజేస్తుంది.