US: హర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ లేదన్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మార్గంలో నౌకల రాకపోకలను నియంత్రించే హక్కు ఇరాన్‌కు లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా, ఆ దేశ సైనికాధికారులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జూలై 9న సామాజిక మాధ్యమాల్లో "ఫ్యాక్ట్ చెక్" రూపంలో ఈ ప్రకటన విడుదల చేసింది. "నిజం ఏమిటంటే.. హర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రించడం లేదు" అని సెంట్‌కామ్ పేర్కొంది. ఇటీవల రెండు రోజుల పాటు అమెరికా ఇరాన్‌కు చెందిన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
వివరాలు
రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే.. ఈ చర్యలకు కారణం
ఈ దాడుల్లో సుమారు 170 లక్ష్యాలను గురి చేసినట్లు సెంట్‌కామ్ తెలిపింది. వీటిలో రాడార్ వ్యవస్థలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన నౌకలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం,రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే ఈ చర్యలకు కారణమని అమెరికా పేర్కొంది. అంతర్జాతీయ సమాజం హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ హక్కు ఉందని గుర్తించలేదని సెంట్‌కామ్ స్పష్టం చేసింది. అలాగే ఈ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా అమెరికా చర్యలు తీసుకుంటోందని తెలిపింది.
వివరాలు
ఈ మార్గంలో 800కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణం చేశాయి
మే ప్రారంభం నుంచి ఇప్పటివరకు 800కుపైగా వాణిజ్య నౌకలు ఈ మార్గంలో సురక్షితంగా ప్రయాణించాయని, వాటి ద్వారా సుమారు 380 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడుల అనంతరం కూడా ఇరాన్ తన వైఖరిలో మార్పు చూపడం లేదని సమాచారం. ఒమాన్ తీరానికి ఆనుకుని ఐక్యరాజ్యసమితి మద్దతుతో ఏర్పాటు చేసిన తాత్కాలిక సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలను వెనక్కి మళ్లించే ప్రయత్నాలు ఐఆర్‌జీసీ చేసినట్లు అమెరికా ఆరోపించింది.
వివరాలు
సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు
ఉత్తర భాగంలోని తమ నియంత్రణలో ఉన్న మార్గాలనే నౌకలు ఉపయోగించాలని టెహ్రాన్ పట్టుబడుతోందని పేర్కొంది. పాశ్చాత్య దేశాల నౌకాదళ కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ "శక్తివంతమైన, వేగవంతమైన ప్రతిస్పందన" ఇస్తామని హెచ్చరించింది. అలాగే జోర్డాన్, బహ్రెయిన్, కువైట్‌లో అమెరికాతో అనుబంధం ఉన్న సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు కూడా నిర్వహించినట్లు వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హర్ముజ్‌పై ఇరాన్‌కు నియంత్రణ లేదని సెంటకామ్ (CENTCOM) చేసిన ప్రకటన
🚫 CLAIM: Iranian state media claims that transit through the Strait of Hormuz is only permitted through routes designated by Iran.
— U.S. Central Command (@CENTCOM) July 9, 2026
✅ TRUTH: Iran does not control the Strait of Hormuz. Since early May, U.S. forces have helped facilitate the successful transit of more than 800… pic.twitter.com/cpnTDBoFEG