
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం వెనుక మేము లేము :అమెరికా,ఇజ్రాయిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.
ఆయన అకాల దుర్మరణం వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉండవచ్చని ఇరాన్ అనుమానిస్తోంది.
అంతరిక్ష నుంచి లేజర్ ద్వారా హెలికాప్టర్‌ని కూల్చేశారనే రకరకాల థియరీలు బయటకు వస్తున్నాయి.
ఇజ్రాయిల్ నిఘా సంస్ధ మొస్సాద్ తన శత్రువులను ఎవరికీ అనుమానం రాకుండా హతమార్చటంలో సిద్ధ హస్తులుగా పేరు ఉంది.
Details
నేపధ్యం ఇదే కావచ్చు?
గాజా యుద్ధం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్నిపెంచింది.
నెల రోజుల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్,ఆ దేశానికి చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారుల్ని హతమార్చింది.
దీనికి ప్రతిగా ఇరాన్,ఇజ్రాయిల్‌పై క్షిపణులతో దాడి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి మరణంతో అన్ని వేళ్లు ఇజ్రాయిల్ వైపు చూపిస్తున్నాయి.
అయితే, 'రైసీ చేతులు రక్తంతో తడిశాయి' అని అమెరికా వ్యాఖ్యానించడం గమనార్హం.అనేక అణచివేతల్లో ఆయన హస్తం ఉందని పేర్కొంది.
పరోక్షంగా అనేక హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని ఇరాన్ ఖండించలేదని అంతర్జాతీయ సమాజం గుర్రుగా ఉంది. పలు యూరోపియన్ దేశాలు అప్పట్లోనే తమ అసంతృప్తిిని వెళ్లగక్కాయి.
Details
హమాస్ కు అండగా ఇబ్రహీం రైసీ?
ఇరాన్‌లో హక్కుల అణచివేతలో ఇబ్రహీం రైసీ పాత్ర ఉంది.హమాస్ సహా అనేక తీవ్రవాద సంస్థలకు మద్దతుగా నిలిచారు.
సాధారణంగా ఎవరు మరణించినా మేం విచారం వ్యక్తం చేస్తాం.అలాగే ఆయన మృతి పట్ల కూడా సంతాపం తెలియజేస్తున్నాం''అని అగ్రరాజ్య జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.
రైసీ న్యాయవ్యవస్థలో పనిచేసిన సమయంలో అనేక మంది రాజకీయ ఖైదీలకు మరణశిక్షలు అమలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
అలాగే అధ్యక్ష హోదాలో ఉండగా..హక్కుల కోసం పోరాడిన మహిళలపై కర్కష వైఖరి అవలంబించారని చెబుతుంటారు.
గతంలో మానహక్కుల కోసం గళ మెత్తిన ఓమహిళపై..ఇబ్రహీం ఆదేశాలకు అనుగుణంగా ఇరాన్ భద్రతా బలగాలు దాడి చేశాయి .
దీంతో ఆమె మృతి చెందారు.దీనిపై అంతర్జాతీయ సమాజం భగ్గుమంది.
Details
మా హస్తం లేదు..
ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి తర్వాత ఇబ్రహీం రైసీకి, అమెరికా మధ్య మాటల యుద్ధం కొంత కాలం సాగింది.
మేము తలుచుకుంటే పెంటగాన్ పై దాడి చేయగలిగే క్షిపణులు తమ వద్ద ఉన్నాయని ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఒకానొక దశలో పశ్చిమాసియా ప్రాంతంలో వాషింగ్టన్ ను అడ్డుకోగలిగిన ఏకైక శక్తి ఇరాన్ కే ఉందనే భావన వచ్చింది.
ఈ నేపధ్యంలో దాడి వెనక తొలుత అమెరికా హస్తం ఉందని అనుమానించారు. చివరికి అటు తిరిగి అందరి కళ్లు ఇజ్రాయిల్ వైపు మళ్లాయి.
అదేం కాదు వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని ఇరాన్ ప్రాధమికంగా నిర్ధారించింది.
Details
అమెరికా కుట్ర ఏమీ లేదు: లాయిడ్ ఆస్టిన్
మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా కుట్ర ఏమీ లేదని రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు.
ప్రమాదానికి దారితీసిన కారణాలకు సంబంధించి ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
కచ్చితంగా ఇరాన్ దీనిపై విచారణ చేస్తుందని.. దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు.
ఈ దుర్ఘటన వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో కొత్తగా ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయని అనుకోవడం లేదన్నారు.