Tahawwur Rana: తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవుర్ రాణా తనను భారత్‌కు అప్పగించడంపై అత్యవసరంగా స్టే విధించాలని అమెరికా సుప్రీంకోర్టును అభ్యర్థించాడు.
భారతదేశంలో తన జాతి, మత, సామాజిక గుర్తింపు కారణంగా చిత్రహింసలు పెట్టి చంపేస్తారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
తాను పాకిస్థానీ సంతతికి చెందిన ముస్లింనని, పాకిస్థానీ సైన్యంలో సేవలు అందించిన మాజీ సభ్యుడినని వివరించాడు.
ఈ కారణంగా కస్టడీలో చిత్రహింసలకు గురయ్యే అవకాశం ఉందని అనుమానించవలసి వస్తోందని, తనను ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టకూడదని కోర్టును కోరాడు.
ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్‌కు అప్పగించడం మరణశిక్ష విధించినట్టే అవుతుందని పేర్కొన్నాడు.
వివరాలు
లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ జైల్లో తహవుర్ రాణా
అంతేకాదు, తన అప్పగింత అమెరికా చట్టాలకు విరుద్ధమని, ఐక్యరాజ్యసమితి తీర్పులను ఉల్లంఘించినట్టేనని తన పిటిషన్‌లో స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో, తన అప్పగింతపై తాత్కాలికంగా స్టే విధించాలని అభ్యర్థించాడు.
అయితే, అమెరికా కోర్టు స్టే విధించేందుకు అంగీకరించలేదు. భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
ప్రస్తుతం, తహవుర్ రాణా లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు.
పాక్-అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం.